తిరుపతి ఎయిర్‌పోర్ట్.. ఇక నుంచి అంతర్జాతీయ సేవలు
తిరుపతి ఎయిర్‌పోర్టు ఇక నుంచి అంతర్జాతీయ సేవలు అందించనుంది..
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి ఎయిర్‌పోర్టు(Tirupati Airport) ఇక నుంచి అంతర్జాతీయ సేవలు(International Services) అందించనుంది. ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టుగా గతంలోనే ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకూ దేశంలో తిరిగే విమానాలకే పరిమితమైంది. అయితే ఈ విమానాశ్రయం(Airport) శుక్రవారం తన సేవలను విస్తరించనుంది. అంతర్జాతీయ స్థాయిలో సేవలు ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి.
తిరుమల శ్రీవారి(Tirumala Srivari)ని దర్శించుకునేందుకు దేశ, విదేశాల నుంచి తిరుపతి(Tirupati)కి భక్తులు వస్తుంటారు. అయితే దేశానికి చెందిన భక్తులు రేణిగుంట ఎయిర్‌పోర్టు(Renigunta Airport)కు వెళ్లి అక్కడ నుంచి వాహనాల ద్వారా తిరుమలకు చేరుకుంటారు. అయితే విదేశాల నుంచి భక్తులు తొలుత చెన్నై లేదా బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్ పోర్టులకు వెళ్లి అక్కడి నుంచి రేణిగుంట ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. ఆ తర్వాత తిరుమల చేరుకుంటున్నారు.
ఇలా విదేశీ తిరుమల యాత్రికులు రెండు సార్లు ఫైట్ జర్నీ చేయాల్సి వస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి సింగపూర్‌కు ప్రైవేటు విమాన సేవలు అందించేలా ఏర్పాట్లు చేసింది. దీంతో శుక్రవారం తొలి అంతర్జాయ విమానం తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి సేవలు అందించనుంది. ఉదయం 5 గంటలకు తిరుపతి నుంచి సింగపూర్‌కు ప్రైవేట్ విమానం బయల్దేరనుంది. ఈ మేరకు ఎయిర్‌పోర్టు అధారిటీ అధికారికంగా ప్రకటించింది. సింగపూర్‌కు తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి సేవలు ప్రారంభంకానుండటంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.