Tirumala Samacharam: భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల.. శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే?
ఆపద మొక్కుల వాడు శ్రీ వేంకటేశ్వరుడి భవ్య మందిరమైన తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కుల వాడు శ్రీ వేంకటేశ్వరుడి భవ్య మందిరమైన తిరుమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. గురువారం శ్రీవారిని దర్శనానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి దాదాపు 19 గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు రావడంతో తిరుమల క్షేత్రానికి ఈ మధ్య కాలంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి క్యూలైన్ గంగమ్మ ఆలయం వరకు క్యూలైన్ కొనసాగుతోంది. గురువారం స్వామి వారిని 64,115 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 32,711 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.