తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి ఉండి ఆదాయం రూ.4.17 కోట్లు

తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.

Update: 2024-02-18 03:38 GMT

దిశ, తిరుమల: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దీంతో శనివారం స్వామివారికి భక్తులు భారీగా కానుకులను సమర్పించడంతో హుండీ ద్వారా రూ.4.17 కోట్ల ఆదాయం వచ్చింది. తద్వారా ఒక్క రోజే 71,021 మంది భక్తులు స్వామి వారి దర్శనం చేసుకున్నారు. అదే సమయంలో 25,965 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కాగా ఆదివారం వేకువ జామున వరకు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ప్రస్తుతం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు తీసుకున్న వారిని మినహాయిస్తే, సాధారణ సర్వ దర్శనం కోసం దాదాపు 8 గంటల సమయం పడుతోంది.


Similar News