జనసేన వర్సెస్ టీడీపీ: మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ బిగ్ స్కెచ్

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో భారీగా వలసలు ప్రారంభమవుతాయని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు.

Update: 2023-12-26 04:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో భారీగా వలసలు ప్రారంభమవుతాయని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు కీలక నేతలు రెడీగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన పార్టీల పొత్తును ప్రజలు ఆశీర్వదిస్తున్నారని... అన్ని సర్వేలు సైతం ఈ కూటమి ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నట్లు చెప్పుకొచ్చారు. గోకవరంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడారు. త్వరలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలుంటాయని వెల్లడించారు. చంద్రబాబు సమక్షంలో భారీగా చేరికలు ఉండబోతున్నట్లు తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గం నుంచి 6 బస్సులు సిద్ధం చేశామని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పుకొచ్చారు. ఇకపోతే జగ్గంపేట టికెట్‌పై అటు టీడీపీ ఇటు జనసేనల మధ్య వార్ నడుస్తోంది. జనసేన పార్టీ అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర టికెట్ ఆశిస్తున్నారు. ఇంటికి దూరంగా - ప్రజలకు దగ్గరగా అనే కార్యక్రమం పేరుతో నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో జనసేన టికెట్ పాటంశెట్టి సూర్యచంద్రకేనని అంతా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే జ్యోతుల నెహ్రూ సైతం తనకే టికెట్ కావాలని పట్టుబడుతున్నారు. నియోజకవర్గంలో జనసేన,టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో టికెట్ విషయంలో పాటంశెట్టి సూర్యచంద్ర, జ్యోతుల నెహ్రూ వర్గాల మధ్య గొడవ జరిగింది. ఇరువురు బాహాబాహికి దిగిన సంగతి తెలిసిందే. అయితే పాటంశెట్టి సూర్యచంద్రకు టికెట్ ఇస్తే తాను సహకరించేది లేదని జ్యోతుల నెహ్రూ తెగేసి చెప్పారు. ఉమ్మడి అభ్యర్థిగా జనసేన నుంచి పాటంశెట్టి సూర్య చంద్రకాకుండా సామాన్య కార్యకర్తను పోటీకి నిలబెట్టినా తాను ఆయన గెలుపు బాధ్యతను భుజాన వేసుకుంటానని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య రగడ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే టికెట్ వార్ నడుస్తోంది. ఇదే సందర్భంలో తన బలం ఏమిటో నిరూపించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ పార్టీలో చేరికలకు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.

Tags:    

Similar News