AP:పవన్ ప్రమాణ స్వీకారం పై మెగాస్టార్ చిరంజీవి స్పందన ఇదే!
ఏపీలో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించింది.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయకేతనం ఎగురవేసింది. ఈ క్రమంలో జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో భారీ మెజార్టీతో విజయం సాధించింది. కాగా పిఠాపురం ఎమ్మెల్యేగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు (జూన్-12) ఏపీ మంత్రిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారాన్ని ఎంతో ఆసక్తిగా చూశారు.
ఈ నేపథ్యంలో తన తమ్ముడు పవన్ కల్యాణ్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గుండెల నిండా సంతోషంగా ఉందని, ఏపీకి మంచి భవిష్యత్తు ఉందన్న భరోసా కలుగుతుందని తెలిపారు. రాష్ట్రంలో సమర్థులు, సుదీర్ఘ పాలన అనుభవం, శక్తిసామర్థ్యాలు ఉన్న నాయకులు వచ్చారని కొనియాడారు.
ఈ మంత్రివర్గం చాలా చాలా బాగుందని..గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఇప్పుడు చూస్తారని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడిన తర్వాత అందుకున్న విజయం కావడంతో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో తన పాత్రను సమర్థంగా నిర్వర్తించగలడని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తాడని తమ్ముడిపై నమ్మకం వ్యక్తం చేశారు.