Kuwait Woman : నన్ను చంపేస్తారేమో..కాపాడండి : కువైట్ నుంచి మహిళ ఆవేదన
జీవనోపాధి కోసం కువైట్(Kuwait)వస్తే కనీసం అన్నం కూడా పెట్టకుండా కొడుతూ హింసిస్తున్నారంటూ నన్ను చంపేస్తారేమోనని, నన్ను కాపాడంటూ ఓ మహిళ కన్నీటితో వేడుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : జీవనోపాధి కోసం కువైట్(Kuwait)వస్తే కనీసం అన్నం కూడా పెట్టకుండా కొడుతూ హింసిస్తున్నారంటూ నన్ను చంపేస్తారేమోనని, నన్ను కాపాడంటూ ఓ మహిళ కన్నీటితో వేడుకుంది. ఏపీ కాకినాడ జిల్లా గండెపల్లి మండలం యల్లమిల్లికి చెందిన కుమారి(Kumari) అనే మహిళకు భర్త లేడు. తన పిల్లలను పోషించుకునేందుకు 7నెలల క్రితం కువైట్ వెళ్లింది. బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లిన ఆమె అక్కడ చిత్రహింసల పాలవుతోంది. అక్కడ తను పడుతున్న చిత్రహింసలపై కుమారి రహస్యంగా వీడియో తీసి బంధువులకు పంపింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తనకు సరిగా తిండి కూడా పెట్టడం లేదని, కొడుతూ హింసిస్తున్నారని..నన్ను చంపేసేలా ఉన్నారని బాధిత మహిళ కుమారి కన్నిటీ పర్యంతమైంది. ఎలాగైనా ఇక్కడి నుంచి తనను కాపాడి నా పిల్లల దగ్గరికి చేర్చాలంటూ వీడియోలో వేడుకుంది. కుమారి కన్నీటి గాథపై ఏపీ ప్రభుత్వం స్పందించి ఆమెను రక్షించే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.