గన్నవరం కూటమిలో కుంపటి.. టీడీపీకి వ్యతిరేకంగా బీజేపీ నేత నామినేషన్

నామినేషన్ల వేళ గన్నవరంలో కూటమిలో కుంపటి చెలరేగింది...

Update: 2024-04-22 10:29 GMT

దిశ, వెబ్ డెస్క్: నామినేషన్ల వేళ కృష్ణా జిల్లా గన్నవరం కూటమిలో కుంపటి చెలరేగింది. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి యార్లగడ్డకు సీటు కేటాయించారు. ఈ మేరకు ఆయన నామినేషన్ సైతం దాఖలు చేశారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆయనకు బిగ్ షాక్ తగిలింది. యార్లగడ్డ అభ్యర్థిత్వాన్ని బీజేపీ నేత శ్రీనివాసరావు వ్యతిరేకించారు. యార్లగడ్డకు రెబల్‌గా నామినేషన్ దాఖలు చేశారు. అంతేకాదు కూటమి పేరుతో బీజేపీ నేతలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నేతలను టీడీపీ నాయకులు కలుపుకుని పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యార్లగడ్డ వెంకట్రావు పొత్తు ధర్మాన్ని పాటించడంలేదని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

దీంతో యార్లగడ్డ అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత రెబల్‌గా మారడాన్ని తప్పు బడుతున్నారు. ఇప్పటికైనా పొత్తు ధర్మాన్ని గౌరవించాలని కోరుతున్నారు. బీజేపీ నేత శ్రీనివాసరావు తన నామినేషన్‌‌ను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురంధశ్వరి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఇక యార్లగడ్డ, శ్రీనివాసరావు మధ్య విభేదాలపై రెండు పార్టీల అధినేతలు త్వరగా స్పందించాలని కూటమి శ్రేణులు కోరారు. 

Read More..

కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ.. దేశంలో ఏకగ్రీవమైన తొలి లోక్‌సభ స్థానం ఇదే 

Tags:    

Similar News