Ap News: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది..

Update: 2024-07-12 10:40 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. నిన్న ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసుకోవడంతో ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే చికిత్స చేస్తు్న్న క్రమంలో వ్యక్తి చనిపోయారు. అయితే వ్యక్తి మృతికి వైద్యం ఆలస్యం చేయడమే కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఓ జూనియర్ డాక్టర్‌పై దాడి చేశారు. దీంతో ఈ దాడికి నిరసనగా జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. తమకు భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. సమ్మెకు నోటీస్ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే సమ్మె నోటీస్‌ను తీసుకునేందుకు సూపరింటెండెంట్ నిరాకరించారు. రంగంలోకి దిగిన పోలీసులు జూనియర్ డాక్టర్లకు సర్ది చెప్పారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో జూనియర్ డాక్టర్లు ఆందోళనను విరమించారు.


Similar News