AP politics:ఉత్కంఠ రేపుతున్న ఏపీ రాజకీయాలు..అన్న సిద్ధం..చెల్లి యుద్ధం

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పుడు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి.

Update: 2024-02-22 12:12 GMT

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పటికప్పుడు ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల రాజకీయం రసవత్తరంగా మారింది. గత ఎన్నికల్లో అన్న జగన్ కోసం పోరాటం చేసిన షర్మిల.. ప్రస్తుతం అన్న పైనే పోరాటం చేస్తోంది. జగన్  సిద్ధం పేరుతో భహిరంగ సభలు నిర్వహిస్తూ రానున్న ఎన్నికల్లో అధికారం చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు. నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ..? చూపించు.. ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నావ్ అంటూ వైఎస్ షర్మిల జగన్ పై ప్రత్యేక్షంగా యుద్ధం చేస్తోంది.

అయితే ఇద్దరు కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వారసులు.. ఇద్దరు మాట ఒకటే తండ్రి ఆశయాల బాటలోనే మా పయనం. లక్ష్యం ఒకటే అయినప్పుడు కలిసి నడవాల్సిన ఇరువురు చెరో రేవుకు చేరుకొని.. పరస్పరం విమర్శల చేసుకుంటున్నారు. అన్న పతనాన్ని కోరుకుంటున్న ఆంధ్ర ఆడపడుచు.. సొంత చెల్లి పైకే పోలీసులను ఉసిగొల్పుతున్న ఆంధ్ర రాష్ట్ర మహిళల అన్న అని పలువురు ఎద్దేవ చేస్తున్నారు.

అలానే రక్తం పంచుకుపుట్టిన చెల్లి పైన లేని అభిమానం ఆంధ్ర మహిళపై ఉంది అంటే నమ్మశక్యమా..? తొడబుట్టిన అన్న పతనాన్ని కోరుకుంటూ పుట్టింటి గౌరవాన్ని మట్టిలో కలుపుతున్న షర్మిల రాష్ట్రాన్ని తన ఇల్లుగా భావించగలదా..? అనేది ప్రజల్లో రేకెత్తుతున్న ప్రశ్న. అసలు షర్మిల వ్యూహం ఏంటి..? రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? అంటే నూటికి నూరు శాతం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. అయితే షర్మిల కొన్ని ఓట్లను మాత్రం చీల్చ గలదు అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. 


Read More..

Breaking: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన సీఎం జగన్.. సాక్షం ఇదే..

Tags:    

Similar News