Viral News: ఆ జిల్లాలో ఎలుగుబంటి కలకలం..
శ్రీకాకుళం వాసులను ఒకవైపు ఏనుగులు, మరోవైపు ఎలుగుబంట్లు భయపెడుతున్నాయి.
ధిశ ప్రతినిధి, విశాఖపట్నం: శ్రీకాకుళం వాసులను ఒకవైపు ఏనుగులు, మరోవైపు ఎలుగుబంట్లు భయపెడుతున్నాయి. ముఖ్యంగా జీడీ తోటల ఫలసాయం వచ్చే ఈ సీజన్‌లో జీడి తోటలలో తరచూ ఏనుగుగు, ఎలుగుబంట్లు కనిపిస్తుండడం అక్కడ రైతులను కలవర పెడుతోంది.
ఇటీవల ఎలుగుబండి దాడిలో ఒకరైతు చనిపోగా, తాజాగా గురువారం పలాస నియోజకవర్గంలోని వజ్రపు కొత్తూరు మండలం టీ గడూరు గ్రామంలోని జీడి తోటలో ఓ ఎలుగుబంటి హల్చల్ చేసింది. ఎలుగుబంటిని చూసిన రైతులు భయాందోళనతో గ్రామంలోకి పరుగులు తీయగా, యువకులు కేకలు వేయడంతో ఎలుగుబంటి నెమ్మదిగా జారుకుంది.
పెద్ద సంఖ్యలో కర్రలతో వచ్చిన యువకులు గట్టిగా అరుస్తూ విజిల్స్ వేయడంతో ఎలుగుబండి వెనుదిరిగింది. రైతులకు ఎలుగుబంట్లు నుండి రక్షణ కల్పించాలని ఆ ప్రాంత వాసులు ఆటవీశాఖాధికారులను కోరుతున్నారు.