Breaking: వైసీపీకి ఇలా రాజీనామా.. అలా జనసేనలోకి ఎంపీ

సీఎం జగన్ నిర్ణయాలతో ఆ పార్టీ నేతల వికెట్లు డౌన్ అవుతున్నాయి...

Update: 2024-01-13 13:12 GMT

దివ, వెబ్ డెస్క్: సీఎం జగన్ నిర్ణయాలతో ఆ పార్టీ నేతల వికెట్లు డౌన్ అవుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఒక్కొరికగా బయటకు వెళ్లిపోతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధినేతతో తాడో పేడో తేల్చుకుంటున్నారు. వై నాట్ 175 అంటున్న జగన్‌కు చుక్కలు చూపిస్తున్నారు. టికెట్‌పై స్పష్టతకు పట్టుబడుతున్నారు. క్లారిటీ ఇవ్వకపోతే వెంటనే వేరే పార్టీలోకి వెళ్లిపోతున్నారు  ఏ పార్టీలోకి వెళ్లాలనేది ముందుగానే నిర్ణయించుకుని మరీ రాజీనామాలు చేస్తున్నారు. 

సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇటీవల పార్టీ నియోజకవర్గ ఇంచార్జులను మార్పులు, చేర్పులు చేస్తున్నారు. దీంతో సిట్టింగులు మనస్థాపానికి గురవుతున్నారు.వీరికి వేరే చోట సీటు కేటాయించినా అక్కడి వెళ్తే ఓడిపోతామనే భయం పట్టుకుంది. దీంతో పార్టీ నుంచి బయటి వెళ్లిపోతున్నారు. ఇతర పార్టీల్లో చేరి స్థానికంగానే పోటీ చేయాలని భావిస్తున్నారు.


తాజాగా ఎంపీ బాలశౌరి విషయంలోనూ అదే జరిగింది. మచిలీపట్నం ఎంపీగా ఉన్న ఆయనకు సీటు నిరాకరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొంతకాలంగా ఆయనకు సరైన ప్రాధాన్యత కూడా ఇవ్వడంలేదు. జగన్‌కు సన్నిహితుడైన బాలశౌరికి కూడా సీటుపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆయన మనస్థాపానికి గురయ్యారు. పార్టీ కారక్రమాలకు అసలు ఎప్పటి నుంచో దూరంగా ఉంటున్నారు. నాలుగో లిస్టు తన పేరు ఉండదని తెలుసుకున్న ఆయన ఇక వైసీపీలో కొనసాగలేనని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. త్వరలో పవన్ కల్యాణ్ సమక్ష్యంలో ఆయన జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు. జనసేన అధిష్టానం నిర్ణయిస్తే తాను ఎన్నికల్లో పోటీ చేయాలని, లేదంటే పార్టీలో కొనసాగాలని నిర్ణయించుకున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News