బ్రేకింగ్: సుప్రీంకోర్టులో MP అవినాష్ రెడ్డికి మరోసారి చుక్కెదురు

వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది.

Update: 2023-05-23 07:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ నేత, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ చేప్టటింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నర్సింహా ధర్మాసనం ఈ సంద్భరంగా ఎంపీ అవినాష్ రెడ్డికి కీలక సూచన చేసింది.

ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టు వేకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని అవినాష్‌కు సూచించిన అత్యున్నత న్యాయస్థానం.. ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఈ నెల 25వ తేదీన విచారణ చేపట్టి ఆదేశాలివ్వాలని తెలంగాణ హైకోర్టును సుప్రీం ఆదేశించింది. దీంతో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 25వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక, హైకోర్టులో ముందస్తు బెయిల్‌పై విచారణ పూర్తి అయ్యే వరకు సీబీఐ తనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 

Read more:

మీ జమానా... అవినీతి ఖజానా!

Tags:    

Similar News