వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని.. తీర్మానించిన రాష్ట్ర సర్పంచుల సంఘం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచుల సంఘం తీర్మానించింది.

Update: 2024-07-29 14:11 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని సర్పంచుల సంఘం తీర్మానించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర‌ప్రసాద్ తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచులు తమ ఒక నెల జీతాన్ని రాజధాని అమరావతికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించిందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా గ్రామాలకు సంబంధించిన 16 డిమాండ్లతో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.

Tags:    

Similar News