Gun Shoot: తండ్రిపైకే .. గన్​తీసి గలాటా..! ఏపీలోనే.. ఎక్కడంటే..

ఆస్తుల వివాదంలో కన్న తల్లిదండ్రులపైకే కొడుకు గన్​ఎక్కుపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2025-03-24 10:04 GMT
Gun Shoot: తండ్రిపైకే .. గన్​తీసి గలాటా..! ఏపీలోనే.. ఎక్కడంటే..
  • whatsapp icon

 తలుపు తీయలేదని డోర్​కు షూట్​

నెల్లూరులో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

 దిశ, డైనమిక్​ బ్యూరో: ఆస్తుల వివాదంలో కన్న తల్లిదండ్రులపైకే కొడుకు గన్​ఎక్కుపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరులో (Nellore)ఈ ఘటన చోటు చేసుకుంది. గత శనివారం రాత్రి ఇంటికి వచ్చిన కొడుకు తండ్రి తలుపు తీయకపోవడంతో డోర్​కు గన్​తో షూట్​చేశాడు. వివరాల్లోకి వెళితే. నెల్లూరు నగరంలోని ఆచారి వీధిలో నివాసం ఉంటున్న రాజ్‌మల్‌జైన్‌కు వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు. రెండోవాడైన హితేష్‌కుమార్‌జైన్‌ మాత్రం వ్యసనాలకు బానిసగా మారాడు. తనకు రావలసిన వాటా రూ.40 లక్షలు ఇప్పటికే తీసుకున్నాడు. ఆ డబ్బును వ్యాపారంలో నష్టపోయాడు. దీంతో తండ్రితో తరచు గొడవలు పడుతున్నాడు. ఈ నెల 11న వచ్చి తనకు ఆస్తిలో కొంత ఇవ్వాలని లేకపోతే తుపాకీతో కాల్చుకుకుని చనిపోతానని బెదిరింపులకు దిగాడు. ఆ సమయంలో తుపాకీ పేలలేదు. మళ్లీ శనివారం రాత్రి ఐదుగురు మిత్రులతో కలిసి ఇంటికి వచ్చాడు. తలుపులు తెరవాలని గొడవ చేశాడు. తీయకపోవడంతో తన వెంట తెచ్చుకున్న గన్​తో డోర్​కు షూట్​చేశాడు. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పిపోయింది. ఆ తర్వాత బాధితులు నెల్లూరు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో నిందితుడితో పాటు అతని వెంట వచ్చిన మరో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News