నీటి మడుగు కాదిది.. రహదారే!

రహదారులు నాగరికతకు చిహ్నాలు అని చెబుతున్న పాలకుల మాటలు నిజంగానే నీటి మూటలవుతున్నాయి.

Update: 2024-10-20 15:19 GMT

దిశ ప్రతినిధి,పుట్టపర్తి: రహదారులు నాగరికతకు చిహ్నాలు అని చెబుతున్న పాలకుల మాటలు నిజంగానే నీటి మూటలవుతున్నాయి. ప్రజా ప్రతినిధుల చిన్న చూపు, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా పుట్టపర్తి 20వ వార్డు పెద్దకమ్మ వారి పల్లికి వెళ్లే ప్రధాన రహదారి నీటి మడుగులా తయారైంది. ఈ రహదారిపై ప్రస్తుతం వాహనాలు వెళ్లాలంటే అనేక అవస్థలు పడాల్సిందే. నీరు వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో పెద్ద మొత్తంలో నీరు నిల్వ ఉంటుంది. దీంతో పాదచారులు వాహనదారులు ఈ రహదారి గుండా వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కమ్మవారి పల్లి గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News