‘ఇసుక ఉచితమే.. విపక్షాల ఆరోపణలు నమ్మొద్దు’.. మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత ఇసుక విధానం(Free sand procedure) అమలు చేసిన సంగతి తెలిసిందే.
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ఉచిత ఇసుక విధానం(Free sand procedure) అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం(Government) అమలు చేసిన ఉచిత ఇసుక విధానం పై వైసీపీ నేతలు(YCP Leaders) చేస్తున్న ఆరోపణలపై మంత్రి కొలుసు పార్థసారథి(Kolusu Parthasarathy) స్పందించారు. ఈ క్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. ఇసుకపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నమ్మవద్దని అన్నారు. ఇసుక పూర్తిగా ఉచితమని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఇందుకు వ్యతిరేకంగా ప్రతిపక్షం చేసే ఆరోపణలు నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు. ఇసుక కావాల్సిన వాళ్లు సొంత వాహనాల్లో ఫ్రీగా ఇసుకను తీసుకెళ్లొచ్చన్నారు. ఇసుక తవ్వకాల ఖర్చులు మాత్రమే చెల్లించాలన్నారు. ఉచిత ఇసుకను దారి మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి పార్థసారథి హెచ్చరించారు.