Nara Lokesh:వంగవీటి రాధాను పరామర్శించిన మంత్రి లోకేష్

ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం పరామర్శించారు.

Update: 2024-10-22 14:15 GMT

దిశ, మంగళగిరి: ఇటీవల అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం పరామర్శించారు. ఈ క్రమంలో ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడ చేరుకున్న మంత్రి.. అనంతరం తాడేపల్లి ప్రాతూరులోని వంగవీటి రాధా ఇంటికి స్వయంగా వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Similar News