CID searches: రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సీఐడీ సోదాలు

Update: 2024-10-22 11:03 GMT

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ (New Liquor Policy)అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాలుగా ఉంటున్న బ్రాండ్లు కాకుండా వైసీపీ ప్రభుత్వానికంటే ముందు నుంచి అందుబాటులో ఉన్న బ్రాండ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే కొత్త మద్యం అమ్మకాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం అవకతవకలపై సీరియస్ అయింది. ఈ క్రమంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా.. మద్యం దుకాణాలు, తయారీ కేంద్రాల్లో సీఐడీ(CID) అధికారులు గ్రూపులుగా విడిపోయి మరి సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో ఏకకాలంలో 30 చోట్ల 20 సీఐడీ బృందాలు తనిఖీలు చేపట్టారు. ఇందులో ఎన్టీఆర్‌ 6, కృష్ణా జిల్లాలో 3 చోట్ల సోదాలు నిర్వహించారు. అలాగే కడపలోని ఈగల్‌ డిస్టలరీస్, చిత్తూరు జిల్లాలో మద్యం తయారీ పరిశ్రమల్లో, కసింకోట డీఎస్‌బీ, విశాఖ డిస్టిలరీల్లో, ఏలూరు జిల్లా చేబ్రోలులో లిక్కర్‌ పరిశ్రమలో సీఐడీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు.

Tags:    

Similar News