కర్నూలు, అనంతపురంలో భారీ వర్షం.. పిడుగులు పడి ఇద్దరు మృతి
కర్నూలు, అనంతపురంలో పిడుగులు పడి ఇద్దరు మృతి చెందారు..

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. వర్షాలకు తోడు పలు చోట్ల ప్రజలను పిడుగులు సైతం భయపెట్టాయి. కర్నూలు, అనంతపురం జిల్లాలో పిడుగులు పడ్డాయి. ఈ ఘటనల్లో బాలుడితో సహా మహిళ మృతి చెందారు. మృతుడు కర్నూలు జిల్లా కందనదికి చెందిన బాలుడిగా గుర్తించారు. మృతురాలు అనంతపురం జిల్లా కదిరిపల్లిగా చెందిన మహిళగా గుర్తించారు. ఇద్దరు మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. వర్షం పడుతున్న సమయంలో బాలుడు, మహిళ వేర్వేరు చోట్ల చెట్టుకిందకు వెళ్లారని, ఆ సమయంలో పిడుగులు పడటంతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.