బిగ్ ట్విస్ట్..కూటమి మేనిఫెస్టోకు ఆ పార్టీ దూరం?
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల మేనిఫెస్టోను తాజాగా ఎన్డీయే కూటమి రిలీజ్ చేసింది. ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ సింగ్ ఇతర నేతలు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు.
దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల మేనిఫెస్టోను తాజాగా ఎన్డీయే కూటమి రిలీజ్ చేసింది. ఉండవల్లిలోని టీడీపీ చీఫ్ చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సిద్ధార్థ్ సింగ్ ఇతర నేతలు కలిసి మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే ఈ క్రమంలోనే కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో లో ఆ పార్టీ దూరం ఉన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..ఏపీలో కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో బీజేపీ తరఫున ఎలాంటి అంశాలను ప్రతిపాదించలేదు. అయితే ఈ విషయానికై చంద్రబాబు మాట్లాడుతూ..కేంద్రం దేశవ్యాప్తంగా హామీలు ఇచ్చినందున ఏపీకి ప్రత్యేకంగా హామీలు ఇవ్వలేమని తెలిపినట్టు చంద్రబాబు వెల్లడించారు. మేనిఫెస్టో అమలుకు కేంద్రం సహకారం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా మేనిఫెస్టోపై టీడీపీ, జనసేన గుర్తులను మాత్రమే ముద్రించారు. ఈ నేపథ్యంలో హామీల అమలు బాధ్యత రెండు పార్టీలదేనని చంద్రబాబు తెలిపారు.
Read More...
పవన్ కళ్యాణ్ గెలిస్తే నా పేరు మార్చుకుంటా ..ముద్రగడ సంచలన వ్యాఖ్యలు