మరోసారి భారీగా శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

కర్ణాటక, మహారాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ నది (Krishna River) పరవళ్లు తొక్కింది.

Update: 2024-10-25 03:25 GMT

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక, మహారాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణ నది (Krishna River) పరవళ్లు తొక్కింది. శ్రీశైలం డ్యామ్(Srisailam reservoir) చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఇప్పటికే ఐదు సార్లు డ్యాం గేట్లను ఎత్తిన అధికారులు.. తాజాగా వరద ఉదృతి పెరగడంతో మరోసారి గేట్లను ఎత్తారు. ఎగువ నుంచి కంటిన్యూగా.. శ్రీశైలం(Srisailam) జలాశయానికి వరద కొనసాగుతుండటంతో 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ఇన్ ఫ్లో 1,59,089 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 2,07,820 క్యూసెక్కులు ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా శ్రీశైలం గేట్లను ఎత్తడంతో సాగర్ నిండుకుండలా మారిపోయింది. దీంతో 22 గేట్లను ఎత్తిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు.


Similar News