ఆ ఉగ్రవాదికి శిక్ష.. తిరుపతి హోటళ్లకు బాంబు బెదిరింపులు

లీలామహల్ సమీపంలోనున్న మూడు ప్రైవేటు హోటళ్లతో పాటు రామానుజకూడలిలోని మరో హోటల్ ను పేల్చివేస్తామని పేర్కొంటూ.. పోలీసులకు మెయిల్ లో బెదిరింపులు వచ్చాయి.

Update: 2024-10-25 02:49 GMT

దిశ, వెబ్ డెస్క్: తిరుపతిలోని కొన్ని హోటళ్లకు వచ్చిన బాంబు బెదిరింపులు.. స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. లీలామహల్ సమీపంలోనున్న మూడు ప్రైవేటు హోటళ్లతో పాటు రామానుజకూడలిలోని మరో హోటల్ ను పేల్చివేస్తామని పేర్కొంటూ.. పోలీసులకు మెయిల్ లో బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన డీఎస్పీ వెంకటనారాయణ, సిబ్బంది, స్పెషల్ టీం లు తనిఖీలు నిర్వహించారు. ఇందుకు కారణం తమిళనాడులో ఉగ్రవాది జాఫర్ సాధిక్ కు జైలుశిక్ష పడింది. అందుకు సీఎం స్టాలిన్ సహకారం అందించారు. దీంతో.. ఆయన కుటుంబంతో పాటు తమిళనాడులోని కొన్ని పాఠశాలల్లో పేలుళ్లు జరుగుతాయని ఐఎస్ఐ హెచ్చరించింది. అందులో భాగంగానే తిరుపతిలోని 4 ప్రైవేటు హోటల్స్ ను పేల్చివేస్తామని హెచ్చరించారు.

పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఎక్కడా పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు మెయిల్ పై కేసు నమోదు చేసి.. ఆ మెయిన్ పంపిందెవరో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇదిలా ఉండగా.. నిన్న స్టార్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎస్5-154 విమానానికి గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Similar News