Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

బంగాళఖాతంలో ఏర్పడిని ఆల్పపీడన కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.

Update: 2024-10-25 02:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిని ఆల్పపీడన కారణంగా ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి(Tirupati)లో కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దీంతో భక్తుల రద్దీ స్వల్పంగా తగ్గినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం సమయానికి శ్రీవారి దర్శనానికి 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అలాగే టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ ప్రకటించింది. నిన్న(గురువారం) శ్రీవారిని 61,004 మంది భక్తులు దర్శించుకోగా.. 20,173 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. దీంతో నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.


Similar News