సాగర్, శ్రీశైలంలకు పెరిగిన వరద.. లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

తెలంగాణలో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) కు, ఏపీలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Update: 2024-10-25 04:19 GMT

దిశ, నాగార్జునసాగర్/ వెబ్ డెస్క్: ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి వరద ప్రవాహం మళ్ళీ కొనసాగుతుండటంతో కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని తలపిస్తోంది. శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. జలాశయం 5 గేట్లు 10 అడుగులు మేర ఎత్తివేశారు అధికారులు.. ఇన్ ఫ్లో 1,59,089 క్యూసెక్కులు అయితే.. ఔట్ ఫ్లో 2,07,820 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి్స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 885 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం నీటినిల్వ 215.8070 టీఎంసీలకు చేరి నిండుకుండలా మారింది శ్రీశైలం. ఇక.. కుడి గట్టు జల విద్యుత్‌ కేంద్రంతో పాటు ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలోనూ విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగటంతో ఎన్ఎస్పీ అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు 20 క్రష్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,62,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గత వారంరోజులుగా కొనసాగిన వరద మంగళవారం రాత్రికి తగ్గడంతో గేట్లను పూర్తి స్థాయిలో మూసివేశారు. అనంతరం వరద ప్రవాహం పెరగటంతో గురువారం ఉదయం మొదట 6 గేట్లను, ఆ తర్వాత 10,14,16,20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుండి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు చేరింది. ఈ క్రమంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్లలో ఒక గేటు ద్వారా నీటి విడుదలను జల వనరుల శాఖ అధికారులు ప్రారంభించారు. మరలా ఉదయం 10 గంటల తర్వాత మరో రెండు గేట్లు తెరచి మొత్తంగా మూడు గేట్ల ద్వారా వరద నీటిని నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు విడుదల చేస్తున్నారు.

జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా శ్రీశైల జలాశయానికి 1,96,177 క్యూసెక్కుల వరద నీరొచ్చి చేరుతోంది. మూడు గేట్ల ద్వారా కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 2,10,149క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 590 అడుగులవద్ద నీరు నిల్వవుంది. డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 28,826 క్యూసెక్కుల నీటిని, కుడి కాలువ ద్వారా 10,200 క్యూసెక్కుల నీటిని, ఎడమ కాల్వద్వారా 6173 క్యూసెక్కుల నీటిని, ఎస్.ఎల్.బి.సి ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని, లోలేవల్ కెనాల్ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ నుండి మొత్తం 2,10,149 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Tags:    

Similar News