New Trend: అల్లుడిపై అత్త ప్రేమ..300 రకాల పిండి వంటలతో సంక్రాంతి విందు
సంక్రాంతికి కొత్త అల్లుడు అత్తగారింటికి రావడం ఆనవాయితీ.
దిశ వెబ్ డెస్క్: సంక్రాంతికి కొత్త అల్లుడు అత్తగారింటికి రావడం ఆనవాయితీ. సాధారణంగా కూతురుకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిన తరువాత మొదటి పండుగకు కూతురిని అల్లుడిని ఇంటికి పిలిచి బట్టలు పెడతారు. అలానే అల్లుడికి మర్యాదలు చేస్తారు. అంటే తనకి ఇష్టమైన వంటలు వండి తినిపిస్తారు. అయితే ప్రస్తుతం సంక్రాంతికి ఓ ట్రెండ్ హల్చల్ చేస్తుంది. అదే వందల రకాల పిండి వంటలు తాయారు చేసి అల్లుడితో తినిపించడం. ప్రస్తుతం చాలామంది ఈ ట్రెండ్ ని ఫాలో అవుతున్నారు.
తాజాగా అనకాపల్లిలో ఇలానే ఓ అత్త తన అల్లుడి కోసం ఏకంగా 300 రకాల పిండి వంటలు తయారు చేసి తినిపించింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. తమకు తమ అల్లుడంటే ఎంతో ప్రేమని.. అందుకే ఇన్ని రకాల పిండి వంటలు చేసి సర్ప్రైజ్ చేసానని పేర్కొన్నారు. అలానే ఆ ప్రాంతం ఇప్పటి వరకు ఎవరు అలా చెయ్యలేదని.. మొదటి సారిగా తానే అలా అల్లుడి కోసం అన్ని రకాల పిండివంటలు చేసినట్లు హర్షం వ్యక్తం చేసారు. ఆ కొత్త జంట కూడా ఆ సర్ప్రైజ్ కి చాల సంతోషించామనితెలిపారు.