ఉత్తరాంధ్రలో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్
బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది...
దిశ, వెబ్ డెస్క్: బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన అల్లూరి సీతారామరాజు(Alluri Sitaramaraju District) జిల్లాలో జరిగింది. జి. మాడుగుల(G.Madugula)కు చెందిన గిరిజన బాలిక(tribal girl) ఆశ్రమ పాఠశాలలో చదువుతోంది. అయితే ఈ నెల 25న బాలిక అదృశ్యమయ్యారు. దీంతో తల్లిదండ్రులు ఈ నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు సాయంత్రం పాడేరులో బాలికను గుర్తించారు. అయితే మల్లీశ్వరరావు, సన్యాసిరావు తనను స్కూలు నుంచి తీసుకెళ్లారని, లైంగిక దాడికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. దీంతో పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.