YS Jagan:సీబీఐ కోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్.. కారణం ఏంటంటే?
మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) మరోసారి విదేశీ పర్యటన(Foreign trip)కు అనుమతి కోరనున్నట్లు తెలుస్తోంది.
దిశ,వెబ్‌డెస్క్: మాజీ సీఎం వైఎస్ జగన్(Former CM YS Jagan) మరోసారి విదేశీ పర్యటన(Foreign trip)కు అనుమతి కోరనున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. లండన్(London) పర్యటనకు అనుమతి కోరుతూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) సీబీఐ కోర్టులో శుక్రవారం(జనవరి 3) పిటిషన్ దాఖలు చేశారు. జనవరి 11 నుంచి 25 వరకు కుటుంబసమేతంగా వెళ్లే ఈ టూర్‌కు అనుమతించాలని ఆ పిటిషన్ లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. వైఎస్ జగన్ పిటిషన్ పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సీబీఐ కౌంటర్ తర్వాత ఈ పిటిషన్ పై కోర్టులో వాదనలు ప్రారంభంకానున్నాయి.