AP Govt:తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు.. కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది.
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం(AP Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు(Government orders) ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ ఇవ్వాలని అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు ఇచ్చి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పనితీరులో ఈ ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో 90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ క్రమంలో నేడు(శుక్రవారం) హైదరాబాద్(Hyderabad)లోని హెచ్‌ఐసీసీ(HICC)లో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష(Telugu language) ఔన్నత్యాన్ని, వివిధ రంగాల్లో తెలుగు వ్యక్తుల ఘనతలను కొనియాడారు. తెలుగు వారు ఎక్కడున్న అందరూ ఒకటే అని అన్నారు. నాలెడ్జ్ ఎకానమీ(Knowledge economy)లో తెలుగు వారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.