Super Police: ఎవర్నీ వదలట్లేదుగా..(వీడియో)

ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) పాటించడం అనేది అందరి సామాజిక బాధ్యత.

Update: 2025-01-03 14:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ట్రాఫిక్ రూల్స్(Traffic Rules) పాటించడం అనేది అందరి సామాజిక బాధ్యత. అది వ్యక్తిగతంగా వాహనదారుడికే కాకుండా.. ఇతరులకు హానీ చేయకుండా ఉంటుంది. కానీ.. ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా కొందరిలో మార్పు రాదు. ర్యాష్ డ్రైవింగ్‌లు చేయడం, మద్యంబ సేవించి రోడ్లమీదకు రావడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం వంటివి చేస్తూ ప్రమాదాలకు కారణమవడమే కాకుండా.. ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. దీంతో ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో చోటుచేసుకోకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) పోలీస్ శాఖ(AP Police)కు స్ట్రిక్ట్ ఆదేశాలు జారీ చేశారు.

సీఎం ఆదేశాలను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ట్రాఫిక్ రూల్స్‌ను బ్రేక్ చేస్తున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పోలీస్ అధికారి చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్క వాహనాన్ని అడ్డగించి.. ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. అదే సమయంలో హెల్మెట్ లేకుండా వచ్చిన ఓ పోలీస్ కానిస్టేబుల్‌కు వార్నింగ్ ఇచ్చారు. ఇది గమనించిన వారంతా సూపర్ పోలీస్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Tags:    

Similar News