ఏపీలో మరో భారీ నీటి ప్రాజెక్టు.. రూపకల్పన చేస్తున్న ప్రభుత్వం

రాష్ట్రంలో ప్రతి ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది...

Update: 2024-12-30 04:00 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రతి ఎకరాలకు నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. 100 శాతం కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అంతేకాదు గోదావరి నీటిని వివిధ ప్రాంతాలకు తరలించాలనే ఆలోచన చేస్తోంది. ఇందుకోసం బనకచర్ల వద్ద కొత్త ప్రాజెక్టును నిర్మించాలని ప్రయత్నిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టుతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజలు, పరిశ్రమలకు మేలు జరుగుతుందని ఆకాంక్షిస్తోంది. దాదాపు 280 టీఎంసీల నీరు కృష్ణా డెల్టాకు, సీమకు తరలించేలా ప్రాజెక్టును డిజైన్ చేస్తున్నారు. వర్షాలు, వరద రోజుల్లో నీటిని మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ భారీ ప్రాజెక్టును మూడు దశల్లో కంప్లీట్ చేయాలని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం తీసుకోవాలని చూస్తోంది. అటు పోలవరాన్ని కూడా త్వరగా పూర్తి చేస్తే రాష్ట్రం సస్యశామలం అవుతోందని భావిస్తోంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటనలో కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కూ వివరించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆదివారం జరిగిన సమీక్షలో జలవనరుల, ఆర్థిక శాఖల అధికారులతోనూ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం కోరుతూ త్వరలో కేంద్రానికి లేఖ రాయాలని, అన్ని అనుమతులు తీసుకుని త్వరలో టెండర్లు పిలవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Tags:    

Similar News