Pawan Kalyan:‘కర్మ ఫలం ఎవరినీ వదిలిపెట్టదు’.. డిప్యూటీ సీఎం పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan) ఈ రోజు(ఆదివారం) గుంటూరులో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Update: 2024-11-10 14:32 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan) ఈ రోజు(ఆదివారం) గుంటూరులో నిర్వహించిన అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. అటవీ శాఖ డెవలప్మెంట్(Forest Department Development) కోసం తమ సర్కారు(AP Government) అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. అమరవీరులకు స్థూపాలు సైతం నిర్మిస్తామన్నారు. ఈ క్రమంలో ఆయన తాజాగా సంచలన ట్వీట్(Twitter) చేశారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు సాధారణమని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. కానీ పరిమితులు దాటి కుటుంబాలు, కుల మతాలు, దేవతలను దూషించడం కరెక్ట్ కాదని ట్వీట్ చేశారు. దేహబలం, డబ్బు, క్రిమినల్స్(Criminals) సపోర్ట్ ఉందని బెదిరిస్తే, భయపడటానికి ఇక్కడ ఎవరూ లేరని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలోని సోషల్ మీడియా దుర్వినియోగదారులు ఇతరులను తిట్టేముందు 100 సార్లు ఆలోచించు కోవాలన్నారు. కర్మ ఫలం ఎవరినీ వదిలిపెట్టదని ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.

Tags:    

Similar News