AP News:కూటమి సర్కార్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది: కేంద్రమంత్రి

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-05 11:47 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) పై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో MPDO కార్యాలయంలో ఈ రోజు(శనివారం) పలు విభాగాల అధిపతులతో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి(Union Minister) పెమ్మసాని మాట్లాడుతూ గత వైసీపీ(YCP) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు(Infrastructure) కూడా కల్పించ లేకపోయిందని విమర్శించారు.

ఈ క్రమంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. తెనాలి నియోజకవర్గానికి(Tenali Constituency) కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువస్తామని, ఆ నిధులను ఒక అంచనా ప్రకారం వినియోగిస్తామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తీసుకు రావడంలో తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకు వెళుతుందని కేంద్రమంత్రి పెమ్మసాని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు.


Similar News