వైఎస్ వివేకా హత్యకేసు.. అప్రూవర్ ఇంటికి సీబీఐ బృందం
వైఎస్ వివేకాందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని సీబీఐ అప్రమత్తం చేసింది.
దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ వివేకాందరెడ్డి హత్యకేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని సీబీఐ అప్రమత్తం చేసింది. జాగ్రత్తగా ఉండాలని ఆదేశించింది.వై ఎస్ఆర్ కడప జిల్లాలో సీబీఐ బృందం పర్యటిస్తోంది. ఇప్పటికే వైఎస్ వివేకా ఇంటిని, అవినాశ్ రెడ్డి ఇంటిని పరిశీలించిన సీబీఐ తాజాగా మంగళవారం దస్తగిరి ఇంటికి వెళ్లింది. దస్తగిరికి ఉన్న భద్రతపై ఆరా తీసింది. ప్రస్తుతం కేసు విచారణలో దూకుడు పెరిగిందని.. ఇలాంటి తరుణంలో అప్రమత్తంగా ఉండాలని దస్తగిరికి సీబీఐ సూచించింది.
ఏమైనా సమస్యలు ఉన్నా..భద్రతపై ఎలాంటి ఆందోళన ఉన్నా.. ఏ చిన్న అనుమానం వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని సీబీఐ దస్తగిరిని ఆదేశించింది. ఇకపోతే అప్రూవర్‌గా మారిని దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్ రెడ్డి వల్ల ప్రాణహాని ఉందని ఇప్పటికే అనేకసార్లు ఆరోపించారు. అంతేకాదు కడప ఎస్పీ, సీబీఐ ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నేపథ్యంలో కడప ఎస్పీ దస్తగిరి భద్రతను మరింత పెంచిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి: