కోడలి తల నరికేసిన అత్త
దిశ, ఏపీ బ్యూరో : అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపేట రామాపురంలో దారుణం జరిగింది. Latest Telugu News
దిశ, ఏపీ బ్యూరో : అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపేట రామాపురంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త కోడలి తల నరికేసింది. అంతేకాదు ఆ తలను ఒక పాలిథిన్ కవర్‌లో చుట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చింది. పాలిథిన్ కవర్‌లో కోడలి తలని చూపించే సరికి పోలీసులు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే రామాపురంకు చెందిన సుబ్బమ్మ, వసుంధరలు అత్తా కోడల్లు. అయితే గత కొంతకాలంగా కుటుంబంలో కలహాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో గురువారం అత్తా కోడళ్ల మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తురాలైన అత్త సుబ్బమ్మ కోడలు వసుంధర(35) తల నరికేసింది. దీంతో తల, మెుండెం వేర్వేరు అయిపోయాయి. అనంతరం కోడలు వసుంధర తలను తలను ఒక పాలిథిన్ కవర్‌లో చుట్టి దాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. పోలీస్ స్టేషన్‌లో కోడలు తల బయటకు తీయగా అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. చుట్టు పక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రాయచోటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కావడంతో ఒక్కసారిగా అంతా హడలిపోయారు.