August 15th: ఏపీలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు.. కాసేపట్లో సీఎం జాతీయ జెండా ఆవిష్కరణ

యావత్ భారతావనిలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి....

Update: 2024-08-15 02:25 GMT

దిశ, వెబ్ డెస్క్: యావత్ భారతావనిలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ ఎర్రకోటలో ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. దీంతో దేశవ్యాప్తంగా జెండా పండుగలో భారతీయులందరూ పాల్గొంటున్నారు. అటు ఏపీలో కూడా రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వేడుకలను ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్కూళ్లలో జాతీయ జెండా రెపరెపలాడనుంది. కలెక్టర్ కార్యాలయాల్లో కలెక్టర్లు మువ్వన్నెల జెండాను ఎగురవేయనున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో సహా మంత్రులందరూ పాల్గొననున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో జరిగే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొననున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి ఆయన సైతం ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. 

Tags:    

Similar News