ABP Cvoter Survey: ఏపీలో ఆ పార్టీ బంపర్ విక్టరీ.. 45 శాతం ఓటింగ్‌తో అధికారం
దేశవ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏబీపీ సర్వే ఏపీలో కలకలం రేపుతోంది..
దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ సహా అసెంబ్లీ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ABP Cvoter Survey సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మరోసారి దేశంలో బీజేపీకి తిరుగులేదని తేలింది.ఇటు ఏపీలోనూ సర్వే చేసింది. బీజేపీ కూటమికి 45 శాతం ఓట్లు వస్తాయని.. 42 శాతం ఓట్లు వైసీపీకి దక్కుతాయని తెలిపింది. అంతేకాదు బీజేపీ కూటమికి -20, వైసీపీకి-5 సీట్లు వస్తాయని ఈ సర్వేలో తేలిపోయింది. అటు తెలంగాణలోనూ ఏబీపీ సీ ఓటర్స్ సర్వే నిర్వహించింది. కాంగ్రెస్ -10, బీజేపీ-4, బీఆర్ఎస్ -2, ఎంఐఎం-1 స్థానం దక్కించుకునే అవకాశం ఉందని వెల్లడించింది.
ABP NEWS సౌజన్యంతో..