గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సక్సెస్ చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు: CM జగన్
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారిందని సీఎం జగన్ అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా మారిందని సీఎం జగన్ అన్నారు. విశాఖలో రెండు రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సమ్మిట్‌ను సక్సెస్ చేసిన ప్రతిఒక్కరికి రాష్ట్రం తరుపున కృతజ్ఞతలు తెలిపారు. మీ అందరి పెట్టుబడులతో ఏపీ మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మహ్మమారి కొవిడ్‌ను అధిగమించి రాష్ట్రం మూడేళ్లుగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని అన్నారు. ఈ సమ్మిట్‌లో మొత్తం 352 ఎమ్వోయూలు జరిగినట్లు జగన్ వెల్లడించారు. దీని ద్వారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. 6 లక్షల మందికి దీని ద్వారా ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఏపీ అభివృద్ధికి 15 సెక్టర్లు అత్యంత కీలకమని.. ఆ సెక్టార్లలో సెషన్స్ నిర్వహించామని తెలిపారు. ఈ సెషన్స్‌లో 100 మందికి పైగా స్పీకర్లు పాల్గొన్నారని పేర్కొన్నారు.