గుంటూరు ఎస్పీని కలిసిన ఎమ్మెల్యే శివకుమార్ బాధితుడు.. ఎందుకంటే..!
గుంటూరు జిల్లా ఎస్పీని ఎమ్మెల్యే శివకుమార్ బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ కలిశారు...
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తెనాలిలో పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే శివకుమార్, ఓటరు గొట్టిముక్కల సుధాకర్ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఎమ్మెల్యేపై ఇంకా చర్యలు తీసుకోలేదు. దీంతో శుక్రవారం గుంటూరు జిల్లా ఎస్పీని ఎమ్మెల్యే బాధితుడు సుధాకర్ కలిశారు. కోర్టు ఆదేశాల ప్రకారం తనకు రక్షణ కల్పించాలని కోరారు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటి వద్ద సంచరిస్తున్నారని తెలిపారు. దాడి తర్వాత ఎమ్మెల్యే శివకుమార్‌పై కేసు పెట్టారని, కానీ చర్యలు తీసుకోలేదని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. త్వరగా చర్యలు తీసుకోవాలని కోరారు. తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
కాగా దాడి ఘటన తర్వాత గొట్టిముక్కల సుధాకర్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణ హాని ఉందని, పోలీసులు తనకు రక్షించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ధర్మాసనం సుధాకర్‌కు రక్షణ కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీని కలిసి రక్షణ కల్పించాలని సుధాకర్ కోరారు.
Read More..
ఈసీ నిర్ణయాల వల్లే హింసాత్మక ఘటనలు.. మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు