విభజనతో మరింత దగ్గరవుతున్న తెలుగు ప్రజలు

విభజన సమయంలో రెండు రాష్ట్రాలు మధ్య దూరంతో పాటు ప్రజల్లో మధ్య దూరం ఎక్కువవుతుందని అందరూ భావించారని..

Update: 2023-01-30 09:31 GMT

దిశ, ఉత్తరాంధ్ర : విభజన సమయంలో రెండు రాష్ట్రాలు మధ్య దూరంతో పాటు ప్రజల్లో మధ్య దూరం ఎక్కువవుతుందని అందరూ భావించారని.. కానీ రెండు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు మరింత దగ్గరవుతున్నారని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విశాఖలోని మురళి నగర్‌లో బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పిలి అప్పలకొండ స్వగృహంలో అల్పాహార విందులో గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల ప్రజలందరూ ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళటం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతే దేశానికి రారాజు అని ప్రభుత్వాలు గుర్తు చేసుకోవాలన్నారు. మహిళలను గౌరవిస్తే దేశం కానీ, రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, యాదవ సంఘం నాయకులు, ఇతర అసోసియేషన్ సభ్యులు గవర్నర్‌ను  సన్మానించారు.

READ MORE

అభివృద్ధి, సంక్షేమంపై Mlc Thota Trimurthulu కీలక వ్యాఖ్యలు 

Tags:    

Similar News