TDP: ‘అది దొంగ బతుకు కాదా...?’: జగన్ ట్వీట్‌కు స్ట్రాంగ్ రిప్లై
మాజీ సీఎం జగన్ ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది..
దిశ, వెబ్ డెస్క్: ‘ఒక ఘరానా దొంగోడు, నేను దొరని అంటూ ప్రజలని మోసం చేస్తూ ఉండే వాడు. ఆ సైకో దొంగ బుద్ధి పసిగట్టిన ప్రజలు, ఆ దొంగని పట్టుకుని, ముడ్డి మీద నాలుగు పీకి బుద్ధి చెప్పి, ఊరు నుంచి తోలేశారు. ఆ ఘరానా దొంగ మళ్ళీ వేషం మార్చి, నేను చాలా అమాయకుడిని, ఇక్కడ ఉన్న వారు అందరూ దొంగలు అన్నాడు అంట. అవినీతి గురించి, నువ్వు మాట్లాడితే, అలాగే ఉంటుంది సైకో’’ అంటూ మాజీ సీఎం జగన్‌కు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. జగన్ చేసిన ట్వీట్‌పై రిప్లై ఇచ్చింది.
ఇసుక, మద్యంపై తమరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదంటూ టీడీపీ ఎద్దేవా చేసింది. తమ హయాంలో జరిగిన ఇసుక దోపిడీకి సంబంధించి ఇప్పటికే FIR కూడా బుక్ అయ్యిందని గుర్తు చేసింది. విచారణ కూడా జరుగుతుందని, ఏ నిమిషం అయినా తాడేపల్లి కొంప దాకా వస్తుందని హెచ్చరించారు. ఇక మద్యం విషయంలో, తాడేపల్లి కొంపలో సాయంత్రం అయ్యేసరికి, తమరు డైరెక్ట్‌గా ఎంత డబ్బులు వసూలు చేసే వాడివో, ఆ కేసు విచారణ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుందని చెప్పింది. డబ్బు పిచ్చతోఎంత మంది ప్రాణాలు తీసావో ఆ ఉసురు తగలకుండా ఉంటుందా అని, ఆ కర్మ ఫలం అనుభవించాలి కదా అని అంటూ టీడీపీ కామెంట్స్ చేసింది.
ఒక ఘరానా దొంగోడు, నేను దొరని అంటూ ప్రజలని మోసం చేస్తూ ఉండే వాడు. ఆ సైకో దొంగ బుద్ధి పసిగట్టిన ప్రజలు, ఆ దొంగని పట్టుకుని, ముడ్డి మీద నాలు పీకి బుద్ధి చెప్పి, ఊరు నుంచి తోలేశారు. ఆ ఘరానా దొంగ మళ్ళీ వేషం మార్చి, నేను చాలా అమాయకుడిని, ఇక్కడ ఉన్న వారు అందరూ దొంగలు అన్నాడు అంట.… https://t.co/oZ6vxaPDvp
— Telugu Desam Party (@JaiTDP) October 13, 2024