Breaking: అవినాశ్‌రెడ్డి అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది...

Update: 2023-03-10 09:43 GMT

దిశ, వెబ్ డెస్క్:  కడప ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివేకానందారెడ్డి హత్య కేసులో తనను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలంటూ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఆయన వేసిన రిట్ పిటిషన్‌పై విచారించిన ధర్మసనం.. సోమవారం వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి సూచించింది. అవినాశ్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

ఇప్పటికే రెండుసార్లు విచారణ

వివేకా హత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినా‌ రెడ్డి శుక్రవారం మూడోసారి సీబీఐ ముందు విచారణకు హాజరుకానున్నారు. వివేకా హత్య కేసు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయిన తర్వాత విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. అవినాశ్‌రెడ్డికి ఇప్పటికే రెండుసార్లు జారీ చేసి జనవరి 28న ఒకసారి , ఫిబ్రవరి 24న మరోసారి విచారణ చేసింది.

మరోసారి విచారణ నేపథ్యంలో హైకోర్టులో పిటిషన్

ఈ సందర్భంగా సీబీఐ పలు రకాల ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. నిందితుల విచారణ అభియోగ పత్రాల్లో అవినాశ్‌రెడ్డి పేరు ప్రస్థానకు రావడంతో ఆయనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ పలు కోణాల్లో రెండుసార్లు అవినాశ్‌రెడ్డిని విచారించడం జరిగింది. మరోసారి విచారించేందుకు ఈనెల 6న విచారణ రావాలని నోటీసులు జారీ చేసింది. దీంతో పదో తేదీన విచారణకు హాజరవుతానని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 

Tags:    

Similar News