Mp Avinash Reddy Bail: తగ్గేదేలేదంటున్న సీబీఐ.. మూడు అంశాలపై బలంగా వాదనలు
వివేకానందారెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది....
దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం సీబీఐ తరపున వాదనలు జరుగుతున్నాయి. మూడు అంశాలపై సీబీఐ బలంగా వాదిస్తోంది. వివేకా హత్యకు కుట్ర, కస్టోడియల్ విచారణ, బెయిల్‌ను వ్యతిరేకించడంపై సీబీఐ వాదనలు వినిపిస్తోంది. ఎవరి మెప్పుకోసమో సీబీఐ వ్యవహరించదని, ఓ పద్ధతి ప్రకారం దర్యాప్తు ఉంటుందని పేర్కొంది.
అలాగే విచారణకు అవినాశ్ రెడ్డి సహకరించలేదని, నోటీసులు ఇచ్చిన ప్రతిసారి సమయం అడుగుతున్నారని కోర్టకు సీబీఐ తెలిపింది. ఏప్రిల్ 17, మే 15న నోటీసులు ఇచ్చామని, అయితే అవినాశ్ రెడ్డి కోర్టులను ఆశ్రయిస్తున్నారని గుర్తు చేసింది. ఈ కేసులో మిగిలిన నిందితులు తమ విచారణకు హాజరయ్యారని, అవినాశ్ రెడ్డి మాత్రం విచారణకు సహకరించడం లేదని కోర్టు దృష్టికి సీబీఐ తీసుకెళ్లింది. మిగిలిన నిందితులు సహకరిస్తున్నప్పుడు...అవినాశ్ ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించింది. సామాన్యుల కేసుల్లో ఇంత గడువు తీసుకుంటారని కోర్టులో సీబీఐ వాదిస్తోంది.
Read more:
Mahanadu2023: అవి ఎవరివో చెప్పలగలవా.. సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్
Tdp Mahanadu: రాజమండ్రిలో టెన్షన్.. టెన్షన్.. ఒక్కసారిగా అవి ప్రత్యక్షం