Viveka Case: వైఎస్ భాస్కర్ రెడ్డికి వారంపాటు ఊరట

వివేకానందారెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్‌ మరో వారం పాటు పొడిగిస్తూ తెలంగాణ సీబీఐ కోర్టు న్యాయమూర్తి అనుమతించారు...

Update: 2023-10-03 14:41 GMT

దిశ, వెబ్ డెస్క్: వివేకానందారెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఎస్కార్ట్ బెయిల్‌ మరో వారం పాటు పొడిగిస్తూ తెలంగాణ సీబీఐ కోర్టు న్యాయమూర్తి అనుమతించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని కొన్ని రోజులు బెయిల్ ఇవ్వాలన్న భాస్కర్ రెడ్డి అభ్యర్థనపై కోర్టు అక్టోబర్ 1న ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. అలాగే 3న మళ్లీ విచారణ చేపడతామని ఆదేశించింది. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డి అస్కార్ట్ బెయిల్‌పై ఇవాళ సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. అయితే మరికొన్ని రోజులు పొడిగించాలని వైఎస్ భాస్కర్ రెడ్డి కోర్టును కోరారు. దీంతో మరో వారం పాటు ఆయన ఎస్కార్ బెయిల్‌ను పొడిగిస్తూ  సీబీఐ కోర్టు ఆదేశాలిచ్చింది.

Tags:    

Similar News