దయనీయంగా ద్రవిడ యూనివర్సిటీ పరిస్థితి
వైసీపీ పాలనలో కుప్పం ద్రవిడ యూనివర్సిటి దయనీయ పరిస్ధితులు ఎదుర్కోంటోంది అని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : వైసీపీ పాలనలో కుప్పం ద్రవిడ యూనివర్సిటి దయనీయ పరిస్ధితులు ఎదుర్కోంటోంది అని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆరోపించారు. 3 నెలల నుంచి ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు చెల్లించటం లేదు అని ఆరోపించారు. ఫిబ్రవరి నెలలో కేవలం సీనియర్ ఫ్యాకల్టీకే వేతనాలు చెల్లించారు, జూనియర్ ప్యాకల్టీ, నాన్ టీచింగ్ స్టాప్, ఔట్ సోర్సింగ్ స్టాప్ కి వేతనాలివ్వలేదు అని వాపోయారు. ద్రవిడ యూనివర్సిటీ దయనీయ పరిస్థితులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ లేఖ రాశారు.
202-23 ఆర్దిక సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించిందని కానీ కేవలం ఒక్క ద్రవిడ యూనివర్సిటికీ మాత్రం అదనపు నిధులు కేటాయించకుండా పక్షపాత ధోరణి ప్రదర్శించింది అని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం 2017-18, 2018-19 ఆర్దిక సంవత్సరాల్లో ఏ బ్లాక్ కి రూ. 22 కోట్లు విడుదల చేస్తే.. వైసీపీ ప్రభుత్వం 4 నాలుగేళ్ల నుంచి ద్రవిడ యూనివర్సిటీకి అరకొర నిధులు కేటాయిస్తోంది అని వెల్లడించారు. అందువల్ల ఉద్యోగులకు వేతనాలు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నారు అని చెప్పుకొచ్చారు. యూనివర్సిటీ కోసం భూములు త్యాగం చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగకులకు వేతనాలివ్వకుండా వైసీపీ ప్రభుత్వం వేధిస్తోంది అని ఈ అంశాలపై జోక్యం చేసుకుని ద్రవిడ యూనిర్సిటీ ఉద్యోగులకు వేతానాలిచ్చే చర్యలు చేపట్టాలి అని గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కోరారు.