పీఏసీ చైర్మన్‌గా మరోసారి నియమితులైన టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
ఏపీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మరోసారి నియమితులయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు ప్రకటించారు. పీఏసీ చైర్మన్ పదవితోపాటు 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను నియమించిన అసెంబ్లీలో ఆర్థిక కమిటీల వివరాలను సైతం వెల్లడించారు. ఇకపోతే ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ)చైర్మన్‌గా వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, ఎస్టిమేట్ (అంచనాల) కమిటీ చైర్మన్‌గా విశ్వాసరాయి కళావతిలను నియమించినట్లు వెల్లడించారు. ఇకపోతే పీఏసీ, పీయూసీ, ఎస్టిమేట్ కమిటీల సభ్యుల నియామకాలను సైతం ప్రకటించారు.
పీఏసీ కమిటీ సభ్యులు
పయ్యావుల కేశవ్ నేతృత్వంలోని పీఏసీ కమిటీలో పలువురు సభ్యులకు చోటు కల్పిస్తూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులు కీలక ఆదేశాలిచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, చింతల రామచంద్రారెడ్డి, కంబాల జోగులు, కొఠారి అబ్బయ్య చౌదరి, అబ్దుల్ హఫీజ్‌ఖాన్, జక్కంపూడి రాజా, కె. భాగ్యలక్ష్మిలకు పీఏసీ కమిటీలో చోటు కల్పించారు. ఠిక ఎమ్మెల్సీల విషయానికి వస్తే కుంభా రవిబాబు, పర్చూరి అశోక్‌బాబు, కేఎస్ లక్ష్మణరావులను కూడా సభ్యులుగా నియమించారు.
పీయూసీ కమిటీ సభ్యులు
ప్రభుత్వ రంగ స్థల కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ను నియమించిన సంగతి తెలిసిందే.అయితే కమిటీలో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, రవీంద్రనాథ్‌రెడ్డి, అన్నా రాంబాబు, ఆరణి శ్రీనివాసులు, కిలారి వెంకట రోశయ్య, నాగులాపల్లి ధనలక్ష్మి, అలజంగి జోగారావు, పీజీవీఆర్ నాయుడు (గణబాబు)లకు చోటు కల్పించారు. ఇక ఎమ్మెల్సీలు చెన్నుబోయిన శ్రీనివాసరావు, లేళ్ల అప్పిరెడ్డి, బి.తిరుమలనాయుడులకు కూడా కమిటీలో చోటు దక్కింది.
ఎస్టిమేట్ కమిటీ సభ్యులు
ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి నేతృత్వంలోని ఎస్టిమేట్ కమిటీ సభ్యులను సైతం ప్రభుత్వం నియమించింది. వైసీపీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,గొర్లె కిరణ్‌కుమార్, మద్దిశెట్టి వేణుగోపాల్, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, ఎం తిప్పేస్వామి, ఏలూరి సాంబశివరావులకు ఎస్టిమేట్ కమిటీలో చోటు కల్పించారు. ఇకపోతే ఎమ్మెల్సీలు దేవసాని చిన్న గోవింద రెడ్డి, కృష్ణ రాఘవ జయేంద్ర భరత్, దువ్వారపు రామారావులకు సైతం కమిటీలో భాగస్వామ్యం చేశారు.