ఏపీలో తప్ప ఆ ఆంక్షలు ఎక్కడా లేవు: Nara Lokesh

ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు....

Update: 2023-09-23 15:31 GMT

దిశ, వెబ్ డెస్క్: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. అయితే అధినేత జైలు ఉండటంతో టీడీపీ నేతలు, కర్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నేతలు, కార్యకర్తలపై పలు చోట్ల పోలీసులు కేసులు పెడుతున్నారు. చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణలోనూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో అయితే ఐటీ ఉద్యోగులు భారీగా ధర్నాలు, ర్యాలీ చేపట్టారు. కానీ ఎక్కడ కూడా కేసులు నమోదు చేసిన దాఖలాలు లేవు. కనీసం అడ్డుకునే ప్రయత్నం చేసినట్లుగా కనిపించలేదు. దీంతో ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు అరెస్ట్ తీరుపై జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై  మండిపడ్డారు. బాపట్లలో చంద్రబాబు శాండ్ ఆర్ట్ వేసిన టీడీపీ శ్రేణులపై కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. శాంతియుత నిరసనపైనా కేసులు పెట్టడం బ్రిటీష్ కాలంలో కూడా జరగలేదన్నారు. కానీ రాష్ట్రంలో మాత్రం బ్రిటీష్ పాలనను మించిన స్థాయిలో కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. నిరాహార దీక్షలు, కొవ్వొత్తుల ర్యాలీలపైనా హత్యాయత్నం కేసులు పెట్టి సీఎం జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News