ఇప్పటం గ్రామంపై టీడీపీ, జనసేనవి చౌకబారు రాజకీయం: Ambati Rambabu

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విరుచుకుపడ్డారు.

Update: 2022-11-25 09:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విరుచుకుపడ్డారు. గుంటూరు ఇప్పటం గ్రామంలో ఆక్రమణల కూల్చివేత విషయంలో పవన్ కల్యాణ్ గగ్గోలు పెట్టారని మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆక్రమణల తొలగింపు అనేది చిన్న విషయం అని దానిపై టీడీపీ, జనసేన పార్టీలు చవకబారు రాజకీయం చేశాయని మండిపడ్డారు. ఇప్పటం గ్రామంలో ఏదో జరిగిపోతుందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించారన్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అయితే ఏకంగా ప్రభుత్వాన్నే కూల్చేయాలంటూ నానా హంగామా చేశారంటూ ధ్వజమెత్తారు. ఇప్పటం గ్రామంలో ఆక్రమణల తొలగింపు కేసులో హైకోర్టు ఏం చెప్పిందో ఇప్పటికైనా నేతలు తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం ఎక్కడా దౌర్జన్యంగా వెళ్లలేదని న్యాయంగానే వెళ్లిందని చెప్పుకొచ్చారు. కోర్టును తప్పుదోవ పట్టించిన 14 మందికి రూ.లక్ష చొప్పున జరిమానా విధించిన విషయాన్ని మంత్రి అంబటి రాంబాబు గుర్తు చేశారు. కోర్టు విచారణలో వాస్తవాలు బయటకు వచ్చాయని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు

AP: కొత్త సీఎస్‌గా జవహర్ రెడ్డి?.. నేడో, రేపో ఉత్తర్వులు 

Tags:    

Similar News