కేసీఆర్ బాటలో చంద్రబాబు? రాజ శ్యామల యాగం.. సీఎం పదవి కోసం హోమాలా?

మన తెలుగు రాష్ట్రాల్లో నేతలు అధికారం దక్కాలని రాజ శ్యామల యాగాలు చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రాజ శ్యామల యాగంతో పాటు వివిధ రకాల యాగాలు, యజ్ఞాలు చేసిన సంగతి తెలిసిందే.

Update: 2024-02-16 13:33 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మన తెలుగు రాష్ట్రాల్లో నేతలు అధికారం దక్కాలని రాజ శ్యామల యాగాలు చేస్తున్నారు. గతంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ రాజ శ్యామల యాగం తో పాటు వివిధ రకాల యాగాలు, యజ్ఞాలు చేసిన సంగతి తెలిసిందే. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో రాజ్య శ్యామల లాంటి అనేక యాగాలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన బాటలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయాణిస్తున్నారని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది. చంద్రబాబు నాయుడు కూడా తన నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఈ యాగం జరుగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగిన పూజా కార్యక్రమాలు, యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. 50 మంది రిత్వికులు యాగ నిర్వహణ లో పాల్గొన్నారు. ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది. చంద్రబాబు కొద్దిరోజుల క్రితం శత చండి యాగం, మహా సుదర్శన హోమం చేపట్టిన విషయం తెలిసిందే.

గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందే మాజీ సీఎం కేసీఆర్ అధికారం దక్కడం కోసం ఈ యాగాలు, యజ్ఞాలు చేశారని, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం యాగం ఫలించక సీఎం కూర్చీ చేజార్చుకున్నారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ఉండటంతో చంద్రబాబు కూడా యాగాలు, హోమాలు చేపడుతున్నారని, కేసీఆర్ బాటలోనే ఆయన కూడా ఎన్నికల సమయంలో యాగాలు చేస్తున్నారని చర్చనీయాంశంగా మారింది. మరోవైపు టీడీపీ యువనేత నారా లోకేష్ సైతం ఎన్నడూ లేనివిధంగా ఇటీవల పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో సీఎం పదవి కోసం హోమాలా? అని ఎన్నికల వేళ హాట్ టాపిక్‌గా మారింది.

రాజ శ్యామల యాగం అంటే

రాజ్యలక్ష్మి వరించాలని, విజేతగా నిలిచేలా చేయాలని చేసేదే రాజశ్యామల యాగం. ఈ యాగం చేస్తే శత్రువు బలం తగ్గుతుందని, రాజకీయాల్లో విజయ లక్ష్మి వరిస్తుందని విశ్వసించేవారు.

Tags:    

Similar News