ఏపీలో జూన్ 4 నుంచి అమల్లోకి ఆ పథకం.. కుండబద్దలు కొట్టిన చంద్రబాబు
ఏపీలో జూన్ 4 నుంచి ఇసుక ఉచిత విధానాన్ని అమలు చేస్తామని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు..
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జూన్ 4 నుంచి ఇసుక ఉచిత విధానాన్ని అమలు చేస్తామని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తెలిపారు. కడపలో ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. తాము అధికారంలోకి వస్తే చంద్రన్న బీమాను మళ్లీ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వ విధానాలతో ప్రజలు విసిగిపోయారని, చాలా మంది జీవితాలు నాశనమైపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచారని, చెత్తమీ పన్ను వేశారని తెలిపారు. నవరత్నాల్లో ఇసుక మాఫియా ఒక రత్నమని, మద్యం మాఫియా రెండోదని, భూ మాఫియా మూడోదని, మైనింగ్ మాఫియా నాలుగో రత్నమని విమర్శించారు. అలాగే హత్యారాజకీయాలు ఐదో రత్నమని, ప్రజల ఆస్తులు కబ్జా చేయడం ఆరో రత్నమని చంద్రబాబు ఎద్దేవా చేశారు.