తారక్‌కు ఏమైంది.. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ఎందుకు రాలే?
జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నిన్నామెున్నటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన జూ. ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు. అయితే.. ప్రస్తుతం తను ఆరాధ్య దైవంగా భావించే నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు నడుస్తున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నిన్నామెున్నటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన జూ. ఎన్టీఆర్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారు. అయితే.. ప్రస్తుతం తను ఆరాధ్య దైవంగా భావించే నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలు నడుస్తున్నాయి. ఈ వేడుకలకు జూనియర్ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏ పని తలపెట్టినా తాతను తలచుకోకుండా ఉండని జూ.ఎన్టీఆర్.. దేశవ్యాప్తంగా ఎందరో మహానుభావులు పాల్గొనే వేదికను పంచుకోకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ గైర్హాజరు వెనుక ఏదైనా ప్లాన్ ఉందా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ వేదిక రాజకీయం కాబోతుందనే ఉద్దేశంతో దూరం అయ్యారా అనేది కూడా వినిపిస్తోంది. ఏదిఏమైనా జూనియర్ లేకుండానే సినీ, రాజకీయ ప్రముఖులతో వేడుకలు ఘనంగా జరిగాయి.
దూరం వెనుక మర్మమదేనా?
2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకం. గత ఎన్నికల్లో బొక్కాబోర్లా పడ్డ టీడీపీకి వచ్చే ఎన్నికల్లో గెలుపొందడం తప్పనిసరి. ఖచ్చితంగా గెలుపొందాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలంటే ఆ పార్టీపై ఉన్న నెగిటివిటీని తొలగించుకోవడం అత్యంత కీలకం. గత ఎన్నికల్లో చంద్రబాబు, నారా లోకేశ్‌లపై తీవ్రంగా నెగిటీవిటీ వచ్చింది. అదే ఓటమికి కారణమైంది. ఈ విమర్శలకు ముకుతాడు వేసేందుకు నారా లోకేశ్‌ను యువగళం పాదయాత్ర పేరుతో ప్రజల్లోకి వదిలారు. దీంతో లోకేశ్‌కు ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అందుకే జూ.ఎన్టీఆర్‌ను చంద్రబాబు పక్కన పెడుతున్నారనే ప్రచారం ఉంది. అందువల్లే నందమూరి అభిమానులు ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పార్టీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ వస్తే లోకేశ్ కు భవిష్యత్ ఉండదనే భయంతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
2009 ఎన్నికలే లాస్ట్..
2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. తాత ఎన్టీఆర్‌ను మైమరపించేలా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ అనగర్గళంగా మాట్లాడుతూ ప్రజల్లోకి వెళ్లారు. దీంతో ఎన్టీఆర్ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. అయితే.. ప్రచారం ముగించుకుని వెళ్తుండగా యాక్సిడెంట్ అవ్వడం గాయాలవ్వడంతో ప్రచారానికి దూరమయ్యారు. అప్పటి నుంచి టీడీపీ గురించి గానీ రాజకీయాల గురించి గానీ పట్టించుకోలేదు. ఇందుకు మరో కారణం కూడా లేకపోలేదు.
చంద్రబాబు ప్రత్యామ్నాయ మార్గం ఇదేనా?
జూనియర్ ఎన్టీఆర్ ఒకవేళ టీడీపీకి దూరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను సైతం టీడీపీ అనుసరించినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ఇప్పటికే స్టార్ కాంపెయినర్లుగా ఉన్నారు. మరోవైపు నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, సుహాసిని, రామకృష్ణలను ఎన్నికల ప్రచారంలో దించుతారనే ప్రచారం ఉంది. 2014 ఎన్నికల్లో సైతం స్టార్ క్యాంపెయినర్లు లేకపోయినా పవన్ కల్యాణ్.. నరేంద్ర మోడీ గ్లామర్ టీడీపీకి అదనపు బలంగా మారింది. దీంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2024 ఎన్నికల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ విధంగా జూనియర్ లోటును బాబు భర్తీ చేస్తారనే ప్రచారం ఉంది.
Also Read...